దేవుడి సేవ కోసం రోబోటిక్ ఏనుగు

దేవుడి సేవ కోసం రోబోటిక్ ఏనుగు
Irinjadappilli Sri Krishna Temple

దేవాలయాల్లో జరిగే ఉత్సావాల్లో, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఏనుగులను ఉపయోగించడం మనం చూస్తుంటాం. కొన్ని వేడుకల సమయాల్లో విగ్రహాలను ఏనుగులపై ఊరేగిస్తుంటారు. అయితే వీటి వల్ల ఏనుగులు హింసకు గురవుతున్నాయని భావించి కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో ఉన్న ఇరింజడప్పిల్లి శ్రీకృష్ణ దేవాలయం ఓ కొత్త ప్రయోగానికి పూనుకుంది. ఆచార వ్యవహారాలు నిర్వహించేందుకు నిజమైన ఏనుగు స్థానంలో ఓ రోబోటిక్ ఏనుగును ప్రవేశపెట్టింది.

ఇక నుంచి నిజమైన ఏనుగు చేయాల్సిన క్రతులన్నీ ఏ యాంత్రిక ఏనుగు చేయనుంది. ఈ ఏనుగుకు ‘ఇరింజడప్పిల్లి రామన్’ అని నామకరణం చేశారు.  ఈ ‘ఇరింజదపల్లి రామన్’ దేవాలయంలో వేడుకలను సురక్షితంగా, క్రూరత్వం లేకుండా నిర్వహించడానికి సహాయపడుతుందని, దీని వల్ల నిజమైన ఏనుగుల పునరావాసం కల్పించడానికి, అవి స్వేచ్ఛగా అడవులలో జీవించడానికి తోడ్పడుతుందని ‘పెటా’ ఇండియా పేర్కొంది.