గ్రామాలకు రోడ్లు వేయలేని నాయకులు జాతీయ రహదారి ఎలా తెగలరు – ఎల్లేని 

గ్రామాలకు రోడ్లు వేయలేని నాయకులు జాతీయ రహదారి ఎలా తెగలరు – ఎల్లేని 

ముద్ర.కొల్లాపూర్: గ్రామాలకు రోడ్లు వేయలేని నాయకులు జాతీయ రహదారి ఎలా తెగలరని నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు కొల్లాపూర్ నియోజకవర్గం బిజెపి పార్టీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు అన్నారు. పానగల్ మండలం చిక్కేపల్లి, కేతేపల్లి గ్రామాలలో బీజేపీ పరివర్తన్ యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న ఎల్లేని మాట్లాడుతూ మీ సమస్యలు నామదిలో ఉన్నాయి నన్ను మీ మతిలో పెట్టుకోన్నీ కొల్లాపూర్ నియోజక వర్గంలో కాషాయ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా   వచ్చే ఎన్నికల్లో బిజెపి పార్టీని గెలిపించాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలు అని పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో ఏ ఇంటికెళ్లిన,ఎ గడప తొక్కిన సమస్యలే స్వాగతం పలుకుతున్నాయని  ఆవేదన చెందారు.రాష్ట్రం లో దీనమైన పరిస్థితి ఉంటే కొల్లాపూర్ నియోజకవర్గం లో మాత్రం అంతకు మించి సమస్యలు ఉన్నాయని,గత 20 సంవత్సరాలు గా పూటకో పార్టీ మారుతూ,కొల్లాపూర్ ప్రజలను మభ్యపెడుతూ మనబిడ్డల బ్రతుకులను మద్యానికి బానిసలుగా చేస్తూ, ఇన్ని రోజులు కొల్లాపూర్ ను దోచుకున్న నాయకులకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని అన్నారు.కార్యక్రమంలో ఎల్లేని తో పాటు పలువురు రాష్ట్ర జిల్లా,మండల,వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.