అన్ని దానాల్లో కంటే అన్నదానం​ మిన్న

అన్ని దానాల్లో కంటే అన్నదానం​ మిన్న
Charity is better than all donations

ముద్ర, వేములవాడ: అన్ని దానాల్లో కంటే అన్న దానం మిన్న అని మై వేములవాడ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మహేష్ అన్నారు…ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 630 రోజులుగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని  తెలియజేశారు. నేటి అన్నదాతలుగా వెలిచాల గోవర్ధన్ రజిత దంపతులు, యామ దేవరాజు సమత దంపతులు శాశ్వత అన్నదాతలుగా జువ్వాడి వెంకటేశ్వరరావు స్నేహాలత దంపతులు, ప్రతాప సంపత్, నగుబోతు రవీందర్ జ్యోతి దంపతులు వున్నారని తెలిపారు.


అన్నదానానికి సహకరించిన సహకరిస్తున్న, దాతలకు ట్రస్ట్ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. నేటి అన్నదాన కార్యక్రమంలో నాగుల చంద్రశేఖర్, చల్లా సత్తయ్య, కొప్పుల హనుమాండ్లు, పొలాస రాజేందర్, గొండ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.