మహాత్మ జ్యోతిరావు పూలే డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి - ప్రిన్సిపాల్ కె. వీర ప్రభాకర్

మహాత్మ జ్యోతిరావు పూలే డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలి - ప్రిన్సిపాల్ కె. వీర ప్రభాకర్


ముద్ర,ఎల్లారెడ్డిపేట: మహాత్మా జ్యోతిరావు పూలే బాలుర  ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో  ప్రవేశానికి ఇంటర్మీడియట్ పూర్తి అయిన అడ్వాన్సుడ్ సప్లమెంటరీ లో పాస్ అయిన విద్యార్థులు  కూడా దరఖాస్తు చేసుకోవాలని  కళాశాల ప్రిన్సిపాల్ కె వీర ప్రభాకర్ శుక్రవారం పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని  మహాత్మ జ్యోతిరావు పూలే గురుకుల కళాశాల లో విద్యార్థులు ఆన్లైన్లో సిరిసిల్ల మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల బాలికల  కళాశాలలో  ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు.సిరిసిల్ల మహాత్మ జ్యోతిబాపూలే  బాలికల గురుకుల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్   డి కృష్ణ మూర్తి  సెల్ నెంబర్ 99082 94365 గాని ఎల్లారెడ్డిపేట  మహాత్మ జ్యోతిబాపూలే బాలుర  డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె వీర  ప్రభాకర్ సెల్ నెంబర్ 70131 47665 కు గాని  సంప్రదించాలని జిల్లా ప్రాంతీయ  సమన్వయ రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారి తెలిపారు.