అన్నదాతల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది - సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి      

అన్నదాతల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది - సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి      

ముద్ర,  ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల బొప్పాపూర్ గ్రామంలో మంగళవారం కాంగ్రెస్  పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.అనంతరం రైతులతో సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడారు. రైతులు అధైర్య పడవద్దని రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో తడిసిన ధాన్యాన్ని కొనేంతవరకు ప్రతి ఐకెపి మరియు సహకార సొసైటీ కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూర్చుండి పోరాటం చేయడం జరుగుతుందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలలో 20 రోజుల కిందటే వడ్లు వచ్చినప్పటికీ స్థానిక నాయకులు కొబ్బరికాయలు కొట్టడం కార్యక్రమాలు మూలంగా తూకం వేయడం ఆలస్యమైందన్నారు. ఫలితంగా రైతుల వడ్లు మిల్లర్లు కొనలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని మిల్లర్లతో మాట్లాడి వడ్లను తరలించాలన్నారు. చేతికి వచ్చిన వరి చేనులు వడగళ్ల వాన మూలంగా వడ్లు మొత్తం రాలిపోవడం జరిగిందన్నారు. రైతులు ప్రస్తుతం దిక్కుతోచని పరిస్థితులలో ఉంటున్నారు.మంత్రి కేటీఆర్ సభలు సమావేశాలు ఆత్మీయ సమ్మేళనాల పేరిట రైతులను పట్టించుకోవడం లేదన్నారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడు ముందుండి కొట్లాడం జరుగుతుందని, రైతులకు రుణమాఫీ అయ్యేంతవరకు పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,  జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, జిల్లా కార్యదర్శి లింగం గౌడ్, మైనార్టీలకు సెల్ అధ్యక్షులు సాహెబ్, కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాసరెడ్డి, రైతులు బుచ్చిరెడ్డి ,కొండపురం శ్రీనివాసరెడ్డి ,లక్ష్మణ్, చెన్ని బాబు, రాజేందర్, రాజు నాయక్,గంట బుచ్చాగౌడ్,రామ్ రెడ్డి, బిపేట రాజు, సంతోష్ గౌడ్ ,ఎల్లయ్య, బాలయ్య, శ్రీకాంత్ రెడ్డి, నారాయణరెడ్డి, మహేందర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.