7 గంటలకు తప్పనిసరిగా విధుల్లో హాజరు కావాలి

7 గంటలకు తప్పనిసరిగా విధుల్లో హాజరు కావాలి

ఆడిసనల్ కలెక్టర్ మకరందం
----------------------------------------
ముద్ర, మల్యాల: పంచాయతీ సెక్రటరీలు ఉదయం 7 గంటలకు తప్పనిసరిగా  విధుల్లో హాజరు కావాలని అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) ఆదేశించారు. గురువారం ఆయన స్పెషల్ శానిటేషన్ కార్యక్రమంలో భాగంగా మల్యాలలో పర్యటించారు. ఈ సందర్బంగా ఆయన గ్రామంలోని పలు కాలనీల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలకు భూమి పుజా చేశారు. అనంతరం శానిటేషన్ పనులు, నర్షరీ, డంపింగ్ యార్డ్ పరిశీలించారు. వర్మీకoపోస్ట్ తప్పనిసరిగా తయారు చేయాలని సర్పంచ్, సెక్రటరీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మిట్టపల్లి సుదర్శన్, ఎంపీడీఓ వెంకటేష్, ఎంపీవో వాసవి, సెక్రటరీ గుండేటి రవీందర్, వార్డ్ సభ్యులు మిట్టపల్లి దశరథo, తదితరులు పాల్గొన్నారు.

కాగా, ఎంపీడీఓ వెంకటేష్ మాట్లాడుతూ ఈ నెల 17 నుంచి 23 వరకు స్పెషల్ శానిటేషన్ ప్రోగ్రామ్ కింద మల్యాల, రామన్నపేట, ఓబులాపూర్ గ్రామాలను ఎంపిక చేసినట్లు తెలిపారు. అడిషనల్ కలెక్టర్ పర్యటన అనంతరం రామన్నపేటలో తిరిగి శానిటేషన్, నర్షరీ, డంపింగ్ యార్డ్, వైకుంఠదామంతో పాటు, పలువురికి ఇండ్లలో ఇంకుడుగుంతలు, కిచెన్ గార్డెన్ ఏర్పాటు, అలాగే స్వచ్ఛసర్వేక్షణ వాల్ రైటింగ్ పనులను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
ఫోటో: