ఎస్ ఐకి మద్దతుగా జగిత్యాలలో కోనసాగుతున్నా బందు 

ఎస్ ఐకి మద్దతుగా జగిత్యాలలో కోనసాగుతున్నా బందు 

ఎస్ఐని సస్పెండ్ చెయాడాన్ని నిరసిస్తు విహెచ్ పి బంధు పిలుపు 
స్వచ్చందంగా బంధు పాటిస్తున్న వ్యాపార సంస్థలు 
కొనసాగుతున్న పొలిసు పహారా 
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఆర్టిసి బసులో ఓ యువతీ, రూరల్ ఎస్ఐ భార్య మధ్య జరిగిన ఓ సంఘటన చిలికి చిలికి గాలివాన తయారు అయి జగిత్యాల రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్  సస్పెండ్ గురి అయ్యారు. ఎస్ ఐ అనిల్ ను ఎలాంటి విచారాణ జరపకుండానే 24 గంటల లోపే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసి ఆదేశాలతో అకారణంగా సస్పెండ్ చేశారని నిరసిస్తూ విశ్వహిందు పరిషత్, బజరంగ్ దళ్ సంస్థలు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలో శనివారం తెల్లవారుజాము నుంచే సంపూర్ణ బంద్ కొనసాగుతుంది.

వ్యాపార సంస్థలు స్వచ్చందంగా బంద్ పాటిస్తున్నారు. ఉదయం జగిత్యాల ఆర్టిసి బసుడిపో నుంచి బస్సులు బయటకి రాకుండా వీహెచ్ పి నాయకులు బసుడిపో ఎదుట ధర్నా నిర్వహించారు. పోలీసులు వారిని వారించి అక్కడి నుంచి  బలవంతంగా లేపి పంపించివేశారు. జగిత్యాల డిపోలోని బస్సులు దూర ప్రాంతాలకు మినహా దగ్గర ప్రాంతాలకు బస్సులు నడపడం లేదు.  విశ్వహిందు పరిషత్, బజరంగ్ దళ్ నాయకులు పట్టణంలో తిరుగుతూ బందును నిర్వహిస్తున్నారు.

జగిత్యాల పట్టణంతో పాటు మల్యాల మండల కేంద్రం, జగిత్యాల రూరల్ గ్రామాల్లో సైతం ఎస్ ఐ అనిల్ కు మద్దతుగా బంధు నిర్వహిస్తున్నారు. జగిత్యాల రూరల్ గ్రామాల ప్రజలు రోడ్లఫైకి వచ్చి రాస్తా రోకోలు చేస్తున్నారు. ఎలాంటి అవంచానియ సంఘటనలు జరగకుండా పోలీసులు శుక్రవారం రాత్రి నుంచే గట్టి బందో బస్తు నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఓ పొలిసు అధికారికి పొలిసు ఉన్నతాధికారులు అన్యాయం చేసారని ప్రజలు స్వచంధగా బంద్ పాటించడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.