జగిత్యాలలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కమలా నిలయం ప్రారంభించిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రావణీ..

జగిత్యాలలో బిజెపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. కమలా నిలయం ప్రారంభించిన మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ శ్రావణీ..

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని పొన్నాల గార్డెన్ సమీపంలో జగిత్యాల నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయం కమలా నిలయాన్ని బిజెపి నాయకురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బోగస్రావని ప్రవీణ్ ప్రారంభించారు.  పార్టీ కార్యాలయ ఆవరణలో భారతీయ జనతా పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ జెండా ను శ్రావణీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, పట్టణ కార్యదర్శి ఆముదరాజు, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు రామేశ్వరి,  రూరల్ మండల్ SC మోర్చా అధ్యక్షుడు తరాల మహేష్, పులి శ్రీధర్, పురెళ్ళ ప్రశాంత్,కళావతి, మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు