యువత మత్తు పదార్థాల బారిన పడకుండా  నిర్మూలించాలి: జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్

యువత మత్తు పదార్థాల బారిన పడకుండా  నిర్మూలించాలి: జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: యువత మత్తు పదార్థాల బారిన పడకుండా ప్రాథమిక స్థాయిలోనే నిర్మూలించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని  సమావేశ మందిరంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సంద్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని యువత డ్రగ్స్ బారిన పడకుండా అన్ని శాఖల అధికారుల భాగస్వామ్యంతో ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రతీ పాఠశాల, కళాశాలల్లో అంటి డ్రగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల వాడకం పై ఉక్కుపాదం మోపాలని, సంబంధిత శాఖల అధికారులు తక్షణ తనిఖీలు చేపట్టాలని, గంజాయి సరఫరా, వినియోగించే వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని అన్నారు.

మత్తు పదార్ధాలతో తయారు చేసిన చాక్లెట్స్  చిన్నారులు తినడం వంటి వార్తలు రావడం జరిగిందని, అలాంటి వాటిని గుర్తించాలని, పోలీసు, సంభందిత అధికారులు తనిఖీలు నిర్వహించాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని, మానసిక నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ ఇప్పించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా వ్యాపార సంస్థలు, రవాణా ప్రాంతాలను తనిఖలు చేపట్టాలని అన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో ని విద్యార్థుల ప్రవర్తనలను పరిశీలించాలని అన్నారు. జిల్లాల సరిహద్దు గల ప్రాంతాలలో ఎక్కువ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు.

ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, ఇతర ప్రాంతాల నుండి వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, జిల్లా సరిహద్దు ప్రాంతాలైన ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, ఇంద్రవెల్లి వంటి ప్రాంతాల నుండి వచ్చే ఆస్కారం ఉంతుందని సంచారం ఉందని తెలిపారు. వివిధ మార్గాలు, పెద్ద వాహనాల్లో రవాణా చేసే అవకాశం ఉందని, వాటిని నిశిత పరిశీలన చేయాలని అన్నారు. వినియోగదారులను పట్టుకుంటే, సరఫరా దారులు తెలుస్తుందని అన్నారు. కొద్ది మోతాదులో మొదట తీసుకొని వాటికి బానిసలుగా మారడం జరుగుతుందని తెలిపారు.

పోలీసు, ఎక్సైజ్, రవాణా, వ్యవసాయం, అటవీ శాఖ, తదితర  డిపార్ట్మెంట్ ల అధికారులు సమిష్టిగా రైడింగ్ చేయాలని అన్నారు. అందరి సహకారంతోనే కంట్రోల్ చేయాలని కోరారు. అంతకుముందు వివిధ స్ఖల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను ఆయా అధికారులు వివరించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ ప్రభాకర్ రావు, డిఎస్పీ వెంకటస్వామి, ఆర్డీఓ లు రాజేశ్వర్, మధు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.