కలెక్టరేట్ మారినా దర్శనమిస్తున్న బోర్డు | MUDRA NEWS

కలెక్టరేట్ మారినా దర్శనమిస్తున్న బోర్డు | MUDRA NEWS
changed Collectorate
  • రోడ్డుకిరువైపులా సూచిక బోర్డులను సైతం అలాగే ఉంచిన అధికారులు
  • తొలగించనీ బోర్డును చూసి గందరగోళంలో ప్రజలు
  • ఇప్పటికైనా అధికారులు తొలగిస్తే బాగుండు

ముద్ర, ప్రతినిధి వికారాబాద్: వికారాబాద్ జిల్లా కలెక్టర్ సమీకృత కార్యాలయం భవనం ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంతకు మునుపు కొనసాగిన ప్రైవేట్ భవనానికి బోర్డు తొలగించకుండా అలాగే ఉంచడంతో  మారు మూల పల్లెల నుండి వచ్చే రైతులు బోర్డును చూసి అయోమయంలో పాత భవనం వద్దకు వెళుతున్న పరిస్థితి నెలకొంది.

బూరుగుపల్లి గేటు సమీపంలో ఉన్న బస్ షెల్టర్ పై, రోడ్డుకిరువైపులా సూచిక బోర్డుకు, ఎంట్రెన్స్ బోర్డు అలాగే ఉంచారు. ఇకపోతే ఆ భవనం లోకి గురుకుల పాఠశాల నడుస్తున్నప్పటికీ కలెక్టరేట్ బోర్డులే దర్శనమిస్తుండం గమనార్హం.ఇప్పటికైనా అధికారులు స్పందించి బోర్డులను తొలగిస్తారా.. లేక అలాగే ఉంచుతారా.. అనేది వేచి చూడాలి మరి..!