అధిక ఫీజుల వసూలు ఆపండి: ఎమ్మార్పీఎస్

అధిక ఫీజుల వసూలు ఆపండి: ఎమ్మార్పీఎస్

మహదేవపూర్, ముద్ర: ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచుతూ ప్రైవేటు పాఠశాలలు నిలువు దోపిడీ చేస్తున్నాయి. పేద,మధ్య తరగతి తల్లితండ్రులు   తమ పిల్లలను. ప్రైవేట్ స్కూళ్లలో చదివించలేక నాన బాధలు పడుతున్నారు. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్ పాఠశాల తీరు పట్టకుండా నిద్ర నటించడం ఏమిటి అని ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ విమర్శించారు.  ప్రభుత్వ పాఠశాలలో అధ్యాపకులు లేరు. ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులకు తట్టుకోలేక ఏం చేయాలో తోచని దిక్కులేని స్థితిలో తల్లిదండ్రులు కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం విద్య హక్కు చట్టాన్ని అమలు చెయ్యక పేద విద్యార్థుల జీవితాలను గాలికి వదిలేసిందని, కేజీ టూ పీజీ నిర్బంధ విద్య ఏమయిందని సురేష్ విమర్శించారు.  ప్రభుత్వ అధికారులు అధిక ఫీజులను నియంత్రించాలని, బడా బాబుల కొడుకులే విద్యను కొనగలరని, సామాన్య పిల్లలకు విద్య అందే పరిస్థితి లేదని వాపోయారు. ఫీజుల విషయంలో ప్రైవేటు యాజమాన్యాలు రాక్షసులుగా వ్యవహరిస్తున్నారని పిల్లలపై  వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. వెంటనే విద్యాశాఖ అధికారులు అధిక ఫీజులపై చర్యలు తీసుకోవాలని ఎం అర్ పి యస్ మండల కన్వీనర్ బెల్లంపల్లి సురేష్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.