అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం 

అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం 

 జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణ రాష్ట్రంలో కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అన్నారు. బక్రీద్ పండుగను  పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద ఏర్పాట్లను, పారిశుధ్య పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ ఎమ్మెల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణంలో హిందూ ముస్లిం లు అన్నదమ్ముల వలె కలిసి ఉంటారని, జగిత్యాల నియోజకవర్గం లో  రాష్ట్ర ప్రభుత్వం, కవిత  సహకారం తో మస్జీద్, షాదీఖాన, అశురఖాన, ఖబరస్తాన్ ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేశామని గుర్తు చేశారు. మైనారిటీ లకు బి అర్ ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీ ఓవర్సీస్ విద్య కోసం 20 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నం అని ,మజీద్ లో పని చేసే ఇమామ్, మౌజన్ లకు పింఛన్ అందజేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాల వారి ముఖ్య పండగలను గొప్ప గా ప్రభుత్వ పరంగా జరుపుతున్నాం అని అన్నారు.

మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేసి ఒక్కొక్క విద్యార్తి పై ఒక లక్ష రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం దేశంలో తెలంగాణ మాత్రమేనని, షాది ముబారక్ ద్వారా రూ. 1,00,116 అందిస్తున్నామన్నారు. తెలంగాణలో హిందూ, ముస్లిం, క్రైస్తవ  సోదర భావం తో ఉంటారని, శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సియం కేసి ఆర్ మతాలకతితంగా ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ది చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్, కమిషనర్ డా.నరేష్, డిఇ  రాజేశ్వర్, కౌన్సిలర్ పంబాల రామ్ కుమార్, మైనార్టీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ ముజాహిధ్, ఎఎంసి  వైస్ చైర్మన్ అసిఫ్,పట్టణ అధ్యక్షుడు  తాజోద్దిన్, జిల్లా ఆర్ టిఎ  మెంబర్ సుధాకర్ రావు, కౌన్సిలర్ చాంద్ పాషా, కుస్రుహజారి, ఫిరోజ్, జావేద్, అహమ్మద్, అస్ఘర్ షా, ఖలేమ్, జహంగీర్,తదితరులు పాల్గొన్నారు.