అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి,  వనపర్తి: అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని  ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.  బుధవారం పట్టణంలోని వివిధ కుల సంఘాల కమ్యూనిటీ భవనం నిర్మాణం కోసం భూమి పూజ నిర్వహించి మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని మాట్లాడారు.  ప్రజల సమస్యలను వార్డు సభ్యులు తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా కృషి చేయాలని, సమాజానికి మంచి పనులు చేస్తేనే మన జీవిత కాలంలో వారు మనల్ని గుర్తుంచుకుంటారన్నారు.  అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ఎంత ప్రేమ ఉంటే మరో అయిదేళ్లు పదవిలో కొనసాగుతామన్నారు. వివిధ అభివృద్ధి పనులకు 8 కోట్ల మంజూరు కాగా అందులో కామన్ హాల్ కు రెండు కోట్లు 25 లక్షలు,  మైనార్టీ క్రైస్తవ చర్చలకు 15 లక్షలు, అయ్యప్ప స్వామి ఆలయానికి 35 లక్షలు, వెంకటగిరి దేవాలయం వరకు బి టి రోడ్డు కోటి పది లక్షలు, వడ్డేవాట రోడ్డు పట్టణంలోని మూడు కోట్లు సిసి రోడ్డు కు మంజూరయ్యానన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండడం వల్లే సాధ్యమైందని అన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ తేజస్ నందులాల్ పవర్ మాట్లాడుతూ పట్టణంలోని తాగునీరు పరిశుభ్రతపై దృష్టి సాధించాలని వచ్చే సీజన్ వరకు మొక్కలను విరిగా నాటి వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి వార్డు సభ్యుడిపై ఉందన్నారు. పదవిలో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో సేవ చేస్తే మనల్ని జీవితకాలం గుర్తించుకుంటారన్నారు. కిందిస్థాయి నుండి ఎప్పటికప్పుడు కష్టపడే మన స్వార్థం కలిగి ఉండాలన్నారు. పట్టణానికి సంబంధించి  8 మందికి కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ చెక్కులను ఏడుగురికి ముఖ్యమంత్రి సహాయని చెక్కులను పంపిణీ చేశారు.

కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్,  మున్సిపల్ చైర్ పర్సన్ సుకేషిని, ఎంపీపీ గుంత మౌనిక, మాజీ జెడ్పిటిసి పి విశ్వేశ్వర్, సి డి సి చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మున్సిపల్ వైస్ పర్సన్ జయమ్మ, చైర్మన్ వాసుదేవా రెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి గాడిలా ప్రశాంత్, కౌన్సిలర్లు కొండారెడ్డి, ఎరుకలి తిరుపతి, పద్మ,  అయ్యన్న, రామ్మోహన్ రెడ్డి,  రాములు యాదవ్,  సంధ్యా,  రవీందర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు మిస్టేక్, వసీంఖాన్,  సుజాత, వాహిద్ హలీ,  నాయకులు అమ్మ పల్లె బాలకృష్ణ,  భీమ్ రెడ్డి, కొండారెడ్డి, నాగరాజు, అస్కని శ్రీనివాసులు, నరేందర్ సాగర్,  సుభాష్,మహేష్, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.