రాములవారి కల్యాణం మీద ఈసీ ఆంక్షలు...

రాములవారి కల్యాణం మీద ఈసీ  ఆంక్షలు...

ముద్ర,తెలంగాణ: -రాములోరి కల్యాణానికి అడ్డుకట్టపడింది. కల్యాణం యధావిధిగా జరుగుతుంది. కానీ దాని ప్రత్యక్ష ప్రసారం చూడలేము. దేశంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండడం వల్ల భద్రాచలం రాములవారి కల్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయొద్దని ఈసీ ఆంక్షలు విధించింది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. రాములోరి కల్యాణానికి ప్రత్యక్ష ప్రసారానికి అనుమతివ్వాలని విజ్ఞప్తి చేశారు. లక్షలాది మంది భక్తులు ఆ అద్భుతఘట్టం కోసం ఎదురుచూస్తారని…ఏడాదికి ఒకసారి వచ్చే ఇలాంటి దాన్ని ఆపడం సరైనది కాదని ఆమె కోరారు. మరోవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో కళ్యాణ క్రతువుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా దూరం ఉండనున్నారు.