క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుణ్యానికి ఉపయోగపడతాయి

క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుణ్యానికి ఉపయోగపడతాయి
  • విద్యార్థి దశ నుండి క్రీడల్లో ప్రావీణ్యత సాధించాలి
  • విద్యార్థినీ విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లో రాణించాలి
  • డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు

తుంగతుర్తి ముద్ర:-క్రీడలు మానసిక ఉల్లాసానికి శారీరక దారుణ్యానికి మానసిక వికాసానికి ఉపయోగపడతాయని డిసిసిబి డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు అన్నారు .శుక్రవారం మండల కేంద్రంలోని బాలుర గురుకుల పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల స్థాయి విద్యార్థుల క్రీడలను ప్రారంభించి మాట్లాడారు .విద్యార్థులకు విద్యతోపాటు క్రీడల్లో ప్రాధాన్యత ఇవ్వాలని తద్వారా శారీరకంగా మానసికంగా విద్యార్థులు దృఢపడతారని అన్నారు .విద్యతోపాటు క్రీడల్లో నైపుణ్యం కనపరిచిన విద్యార్థులు ఉన్నత స్థాయికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థిని విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించి వారి వారి ఆసక్తి ప్రకారం వారు ప్రతిభ కనబరిచే క్రీడల్లో శిక్షణ ఇవ్వాల్సి ఉందని తద్వారా పాఠశాల స్థాయి నుండి మంచి క్రీడాకారులుగా ఎదిగే అవకాశం ఉంటుందని అన్నారు. పాఠశాల స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని జిల్లా స్థాయి క్రీడలకు ఎంపిక చేస్తారని విద్యార్థిని విద్యార్థులు ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించి ఆడిన క్రీడలలో ప్రథమ స్థానాన్ని చేరుకునేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి బోయిని లింగయ్య ,పాఠశాల ప్రిన్సిపల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కొండగడుపుల యాకయ్య ,వ్యాయామ ఉపాధ్యాయుని లు సుభాషిని ,కలమ్మ, శ్రీనివాస్ ,జ్యోతి ,మహేందర్ ,తదితరులు పాల్గొన్నారు.