ఏ రాష్ట్రంలో అమలు చేయని కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు

ఏ రాష్ట్రంలో అమలు చేయని కళ్యాణ లక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలో అమలు
  • సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రం
  • రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాల అమలు
  • మంచి పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు అవసరమైనప్పుడు అండగా నిలవాలి

తుంగతుర్తి ముద్ర: భారతదేశంలోని 28 రాష్ట్రాలలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్నారని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు .బుధవారం తుంగతుర్తి నియోజకవర్గం మద్దిరాల మండలంలో  38 మందికి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను ,అలాగే యాదవులకు 21 యూనిట్ల గొర్రెల పంపిణీ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండి వివాహం చేసుకున్న ప్రతి ఆడపిల్ల పెండ్లికి ఒక లక్ష రూపాయల నగదు ఆర్థిక సహాయం అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని అన్నారు.  ఏ ప్రభుత్వానికి ఏ నేతకు రాని మంచి ఆలోచన సీఎం కేసీఆర్ కు రావడం వెనువెంటనే కులాలు, మతాలకతీతంగా అన్ని వర్గాల వారికి పథకం అమలు చేస్తున్నామని అన్నారు .

ఇప్పటివరకు నియోజకవర్గంలో దాదాపు 1154 మంది ఆడపిల్లలకు 10 కోట్ల 50 లక్షల ఆర్థిక సహాయం అందించామని అన్నారు .అలాగే దళిత బంధు, రైతుబంధు ,బీసీ బందు ,గృహలక్ష్మి ,రైతు బీమా ,గొర్రెల పంపిణీ ,తదితర సంక్షేమ పథకాలన్నీ రాష్ట్రంలో అలాగే తుంగతుర్తి నియోజకవర్గంలో అప్రతిహతంగా అమలవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. అలాగే దళిత బంధు పథకం కింద నియోజక వర్గంలో 1100 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు మంజూరి కానున్నాయని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు అమలుతో పాటు ఇవ్వని వాగ్దానాలను సైతం అమలు చేస్తూ ప్రజల అభిమానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ చురగున్నారని అన్నారు. గతంతో పోలిస్తే రాష్ట్రం అన్ని రంగాల్లో ఘననీయమైన ప్రగతి సాధించిందని అన్నారు .2014ముందు, నేడు ఒకసారి పరిశీలించిన వారికి అభివృద్ధి కానవస్తుందని అన్నారు .నాడు తుంగతుర్తి ప్రాంతంలో సాగు తాగునీరు విద్యుత్ సౌకర్యం లేక రైతులు విలవిలలాడారని అన్నారు. నేడు కావాల్సిన విద్యుత్, సాగునీరు, తాగునీటి సౌకర్యాలు ఉన్నాయని నియోజకవర్గం పూర్తిస్థాయిలో సస్యశ్యామలంగా మారిందని అందుకు పండుతున్న వరి ధాన్య మే సాక్షమని అన్నారు. రానున్న కాలంలో అభివృద్ధి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రజలు మరో మారు అండగా నిలవాలని కోరారు. ఇంకా ఏమైనా మిగిలిన చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుడ్ల ఉపేంద్ర  ,జడ్పిటిసి కన్న సురాంబ , తహసిల్దార్ అమీన్ సింగ్ ,ఎంపీడీవో సరోజ ,సర్పంచ్ కుందూరు విష్ణువర్ధన్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీ రామ్ రెడ్డి ,వెటర్నరీ డాక్టర్ అసిఫా ,లతోపాటు పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు పాల్గొన్నారు  తదితరులు పాల్గొన్నారు.