దేవాలయాల్లో నిత్యం ధూపదీపాలు వెలగాలని ప్రతి దేవాలయానికి నిధులిచ్చిన గొప్ప వ్యక్తి కెసిఆర్ 

దేవాలయాల్లో నిత్యం ధూపదీపాలు వెలగాలని ప్రతి దేవాలయానికి నిధులిచ్చిన గొప్ప వ్యక్తి కెసిఆర్ 

ముద్ర ప్రతినిధి భువనగిరి :రాష్ట్రంలో దేవాలయాల్లో నిత్యం ధూపదీపాలు వెలగాలని ప్రతి దేవాలయానికి నిధులిచ్చిన గొప్ప వ్యక్తి కెసిఆర్ అని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం   భువనగిరి జిల్లా కేంద్రంలో గల పచ్చల కట్ట సోమేశ్వర ఆలయంలో తెలంగాణా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా  నిర్వహించిన తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవ వేడుకకు హాజరై ఆలయంలో స్వామివారికి అభిషేకాలతో పాటు హోమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూతెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోష దాయకమని తెలంగాణా రాక ముందు ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నడూ కూడా నిర్వహించుకోలేదని గత ప్రభుత్వాలు దేవాలయాల్లో ధూప దీపాలకు నిధులు ఇవ్వడం చాలా తక్కువని ముఖ్యమంత్రి రాగానే యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి దేవాలయాన్ని కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారన్నారు. యాదాద్రి మరో తిరుపతి లాగా అవుతుందని మనం కలలో కూడా ఊహించలేదని దీనికి కారణం మన నిత్యకృషివలుడు అభివృద్ధి ప్రదాత ముఖ్యమంత్రి కేసీఆర్ రే అని అన్నారు.చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి దేవాలయాల్లో కూడా నిత్యం ధూపదీపాలు వెలగాలని ప్రతి దేవాలయానికి నిధులని ఇచ్చిన గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి అని అన్నారు. దీనితో పాటుగా బ్రాహ్మణులకు గౌరవ వేతనం కింద 10 వేల రూపాయల జీతభత్యం ఇస్తాడాని బ్రాహ్మణులు ఎవ్వరుకుడా ఊహించలేదని అన్నారు. ప్రతిఒక్క మతాన్ని బలోపేతం చేయడం లో కేసీఆర్ ముందున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గంధాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్,  జిల్లా రైతు చైర్మన్ కొలుపుల అమరేందర్, జెడ్పిటిసి బీరు మల్లయ్య, స్థానిక కౌన్సిలర్ ఊదరి లక్ష్మీ సతీష్, ఆలయ చైర్మన్ కాలేర్ లక్ష్మణ్, అర్చకులు నాగరాజ్ శర్మ, శివ, మనీ  పాల్గొన్నారు.