రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన బిఆర్ఎస్ ను గెలిపించాలి

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన బిఆర్ఎస్ ను గెలిపించాలి
  • కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి సతీమణి బీరం విజయమ్మ

ముద్ర,వీపనగండ్ల:–సబ్బండ వర్ణాల అభివృద్దే లక్ష్యంగా సంక్షేమ పథకాలు అమలు చేసి,రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన బిఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కొల్లాపూర్ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి సతీమణి బీరం విజయమ్మ అన్నారు. మండల పరిధిలోని గోవర్ధనగిరి  లో నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసే ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని మళ్లీ ఎన్నికల్లో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సిఎం.కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ,ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చేసిన అభివృద్ధి కళ్ల ముందే ఉందని,మరొక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని..కొల్లాపూర్ ను మరింతగా అభివృద్ధి చేసుకుందాం అని కోరారు. సంక్షేమ పథకాలు ఇలాగే అమలు కావాలంటే..బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని, రాష్ట్రంలో సిఎం.కేసీఆర్  పరిపాలనలో కొల్లాపూర్ నియోజక వర్గంలో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పాలనలో  అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందిందని మరొక్కసారి బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తె.. మేనిఫెస్టోలొ చెప్పినట్టు పేదలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు.కార్యక్రమంలో నాయకులు సురేష్ రెడ్డి,క్యాతం శేఖర్,మహేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.