అదనపు తరగతి గదికి భూమి పూజ - గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  10 లక్షల నిధులు మంజూరు

అదనపు తరగతి గదికి భూమి పూజ - గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  10 లక్షల నిధులు మంజూరు

ముద్ర,ఎల్లారెడ్డిపేట: అదనపు తరగతి గది భవనానికి గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 10 లక్షల  సి ఎస్ ఆర్  నిధులతో ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారం గ్రామంలో శనివారం ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావులతో కలిసి  భూమి పూజ చేశారు.  ఈ కార్యక్రమంలోసెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, సర్పంచ్ అమృత, ఎంపీటీసీ మామిండ్ల తిరుపతి, ఉపసర్పంచ్ బాలు, మాజీ ఏఎంసీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్, అందే సుభాష్, ప్రధానోపాధ్యాయులు శాంత, గివ్ తెలంగాణ ఎల్లారెడ్డిపేట కోఆర్డినేటర్ వరదవెల్లి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.