వడపర్తి కత్వలోకి కాలేశ్వరం నీళ్లు వచ్చేలా చూడాలి 

వడపర్తి కత్వలోకి కాలేశ్వరం నీళ్లు వచ్చేలా చూడాలి 

ముద్ర ప్రతినిధి భువనగిరి : వడపర్తి కత్వలోకి కాలేశ్వరం నీళ్లు వచ్చేలా చూడాలి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రైతులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  బొమ్మలరామారం మండలం లోని చౌదరిపల్లి గ్రామ సమీపంలో గల చెరువు కాలేశ్వరం నీటితో అలుగు పోస్తుందని ఆ అలుగు నీటిని వడపర్తి కత్వలోకి పడేవిధంగా చూస్తే వడపర్తి, మన్నెవారిపంపు, మేడిపల్లి,  గ్రామాల సమీపంలోని  రైతుల పొలాలకు నీరందుతుందన్నారు.

వడపర్తి, మన్నెవారిపంపు గ్రామాల పరిధిలోని రైతుల పొలాలు ఇప్పటికే నీరు అందకపోవడంతో పంట పొలాలు ఎండిపోయాయని కత్వలోకి నీరు వచ్చే విధంగా చేస్తే భూగర్భ జలాలు పెరిగి బోరు బావులలో నీటి శాతం పెరుగుతుందని దీంతో పంట పొలాలు ఎండిపోకుండా ఉంటాయనీ, వ్యవసాయంపై ఆధారపడిన రైతులకు నీటి తో ఎలాంటి ఇబ్బంది లేకుండా పంట చేతికి వస్తుందని తెలిపారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ ఈఈ తో ఫోన్లో మాట్లాడగా  రెండు రోజులలో వడపర్తి కత్వలోకి నీరు చేరే విధంగా చూస్తానని ఈఈ ఎమ్మెల్యేకు తెలిపారు.  ఎమ్మెల్యేను కలిసిన వారిలో మాజీ సర్పంచ్ గుండ్ల నర్సిరెడ్డి, రైతులు, నాయకులు సామల సత్తిరెడ్డి, గంగాదేవి రవి, కొండల్ రెడ్డి, మన్నే నరేందర్ రెడ్డి, మెడబోయిన శంకర్,  అంకర్ల మలేష్, తిరుమలేష్, బోయిని గణేష్ ఉన్నారు.