ధర్నా లను జయప్రదం చేయాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

ధర్నా లను జయప్రదం చేయాలి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉన్న భూ సమస్యలు, స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈనెల 14వ తహిశీల్దార్ కార్యాలయల ముందు, 21న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న ధర్నాలో పేదలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. శుక్రవారం బీబీనగర్ మండల కేంద్రంలో జిల్లా వ్యాప్త ధర్నాలను జయప్రదం చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో కరపత్రము ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ జిల్లాలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్న పరిస్థితి, అనేక మంది ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకొని వేలాది రూపాయలు గడిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా యాదాద్రి జిల్లాలో ఐదు మండలాల్లో భూ పంపిణీ నిషేధం ఎత్తివేసి అన్ని ప్రభుత్వ భూములను పేదలకు పంచాలని నరసింహ డిమాండ్ చేశారు.

ఇండ్ల స్థలాలు కూడా లేనివారు  వేలాది మంది ఉన్నారని వారందరికీ 125 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లాలో పెండింగ్లో చిన్న నీటి కాలువలు పెద్ద ఎత్తున ఉన్నాయని వాటన్నింటికీ నిధులు కేటాయించి తక్షణం పూర్తి చేయాలని కోరారు.  గ్రామాలలో లింకు రోడ్ల సమస్య, కాలువల పైన బ్రిడ్జిలు, డ్రైనేజీ విద్యుత్తు మంచినీటి వసతులు లేని గ్రామాలు ఉన్నాయని వాటన్నింటికీ ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేయవలసిన పరిస్థితి ప్రభుత్వంపై ఉన్నందని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, భూ సమస్యల పరిష్కారం కోసం జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళన పోరాట కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని నరసింహ పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బండారి శ్రీరాములు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు గాడి శ్రీనివాస్, కందాడి దేవేందర్ రెడ్డి, నాయకులు కొండమడుగు బుచ్చమ్మ, పొట్ట మైసమ్మ,వి.వెంకట్ లక్ష్మి, గణేష్,వి.పుష్ప, బండారి రాజు  పాల్గొన్నారు.