రాజ్యాధికారం తోనే యాదవుల సమస్యలు పరిష్కారం... 

రాజ్యాధికారం తోనే యాదవుల సమస్యలు పరిష్కారం... 
  • మండల శాఖఅధ్యక్షులు వాసరి రవి యాదవ్... 

ముద్ర, రాయికల్ :-రాజ్యాధికారంతోనే యాదవుల సమస్యలు పరిష్కారం అవుతాయని యాదవ  సంఘం రాయికల్ మండల శాఖ అధ్యక్షులు వాసరి రవి యాదవ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ఆయన అధ్యక్షతన జరిగిన మండల  స్థాయి సభ్యత్వ నమోదు, యాదవ ప్రజాప్రతినిధుల  సన్మాన కార్యక్రమం సందర్భంగా వాసరి రవి యాదవ్, లాల్ చావ్లా రాజేష్ యాదవ్ లు మాట్లాడుతూ గొర్రెల కాపరులకు రెండవ విడత గొర్రెల పంపిణీ చేపట్టడంలో భాగంగా నగదు బదిలీ పథకం అమలు చేయాలని, రాష్ట్ర జనాభాలో 20 శాతం ఉన్న యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు 22 ఎమ్మెల్యే, 03 ఎం.పి టిక్కెట్స్ కేటాయించాలని, యాదవ కార్పోరేషన్ ఏర్పాటు చేసి, ఎస్.ఎన్.టి రిజిష్టర్ పునరుద్ధరించాలని కోరారు. యాదవులు, బి.సి. ఐక్యతతో ఉండి రాజ్యాధికారం చేబూనాలని తద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు. అనంతరం యాదవ ప్రజాప్రతినిధులైన ఆలూరు కు చెందిన జిల్లా రైతు సమన్వయ సమితి మెంబర్ లాల్ చావ్లా రాజేష్ యాదవ్ ను, అల్లీపూర్ సింగిల్ విండో చైర్మన్ యాదవనేని రాజలింగం యాదవ్ ను, రాయికల్ ఎ. ఎం. సి వైస్ చైర్మన్ బర్కం మల్లేష్  యాదవ్ ను, బోర్నపల్లి శ్రీరామాలయ దేవాలయ చైర్మన్ దంటిక రాజేశం యాదవ్ లను ఘనంగా శాలువాతో సత్కరించారు. వీరికి యాదవ ఉద్యోగుల సంఘం రాష్ట్ర శాఖ అధ్యక్షులు వేల్పుల స్వామి యాదవ్ భగవద్గీత లను ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రెబ్బాస్ మల్లయ్య యాదవ్,ఆసరి మల్లేష్ యాదవ్,గంగుల శ్రీనివాస్ యాదవ్,గడ్డం మల్లారెడ్డి యాదవ్, కాశవేని రాజేష్ యాదవ్,కొంరయ్య యాదవ్, గంగాధర్ యాదవ్,మల్లేష్ యాదవ్ వివిధ గ్రామాల సంఘ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.