అందరికీ అండా గులాబీ జెండా అభివృద్ధిని నే నా ఎజెండా

అందరికీ అండా గులాబీ జెండా అభివృద్ధిని నే నా ఎజెండా
  • అమాయకులను కేసులపాలు చేసిన రాజ్యం దామోదర్ రెడ్డిధి 
  • గోదావరి జలాలను తెస్తామని తెచ్చిన పనితనం మాది
  • అత్తా కోడళ్ళ మధ్య పంచాయతీ పెట్టిన  పాపంఆయనదే
  • కారు గుర్తుకు ఓటు వేస్తే వెలుగులు.. కాంగ్రెస్ కు వేస్తే చీకట్లు 
  •  పదేళ్ల దామోదర్ రెడ్డి పాలనలో సూర్యాపేట ఆగం
  • 16 సార్లు అవకాశం ఇస్తే పనులు చేయనోళ్లు ఇప్పుడు చేస్తరా..?
  • మూసీ గేటును రిపేర్ చేయాలనే సోయి కూడా ఆ నాడు దామోదర్ రెడ్డికి లేదు
  • మూసి ఆయకట్టు లో వరుసగా 16 పంటలకు సాగునీరు ఇచ్చిన చరిత్ర బిఆర్ఎస్ ధి
  • మూసి పై చెక్ డ్యాం నిర్మాణం మత్స్యకారులకు వరం
  • సూర్యాపేటను టూరిస్ట్ హభ్ గా తీర్చి దిద్దుతా
  • బోట్ హౌజ్ ల నిర్మాణంతో మూసీ ప్రాజెక్టుకు నూతన శోభ
  • యువతకు ఉపాధి  కల్పించడమే లక్ష్యంగా రాబోయే పాలన 
  • పేదల కడుపుచూసే నాయకుడు కేసీఆర్
  • కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు జీవితం ఆగమైతది
  • కరెంట్‌ కాటుకలుస్తది.. 
  • ఆశీర్వదించండి గర్వపడేలా అభివృద్ధి చేస్తా

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట లో అమాయకులను కేసులపాలు చేసిన రాజ్యం దామోదర్ రెడ్డిధి గత పాలన అయితే  ..గోదావరి జలాలను తెస్తామని తెచ్చి జాలు పట్టేంత వరకు తీసుకువచ్చిన ప్రభుత్వం  బిఆర్ఎస్ అని, బిఆర్ఎస్ సూర్యాపేట నియోజకవర్గ అభ్యర్ధి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సూర్యాపేట రూరల్ మండలంలోని ఎండ్లపల్లి, హనుమ తండా, టేకుమట్ల, పిల్లలమర్రి , బిబి గూడెం, దురాజ్ పల్లి, దాసాయిగుడెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ,కారు గుర్తుకు ఓటు వేస్తే ప్రజల జీవితాల్లో  వెలుగులు వస్తే,కాంగ్రెస్ కు వేసే  ఓటు తొ చీకట్లు వస్తాయని అన్నారు.పదేళ్ల దామోదర్ రెడ్డి పాలనలో సూర్యాపేట ఆగం అయిందన్నారు.6 సార్లు అవకాశం ఇస్తే పనులు చేయనోళ్లు ఇప్పుడు చేస్తరా..?
అని ప్రశ్నించారు.

అత్తా కోడళ్ళ మధ్య పంచాయతీ పెట్టిన  పాపం కాంగ్రెస్ దే అన్నారు. మూసీ గేటుకు  రంద్రం పడి నీరు వృదాగే పోయి, పొలాలు ఎండిపోతుంటే రిపేర్ చేయాలనే సోయి కూడా ఆ నాడు దామోదర్ రెడ్డికి లేదన్నారు..2014 లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తే ముసి గేట్లను రిపేర్ చేసి వరుసగా 18 పంటలకు సాగునీరు అందించామని అన్నారు.మూసి పై చెక్ డ్యాం ల నిర్మాణం మత్స్యకారులకు వరం గా మారిందన్నారు.
పేదల కడుపుచూసే నాయకుడు కేసీఆర్ అన్న మంత్రి,కాంగ్రెస్‌కు ఓటేస్తేకరెంట్‌ కాటుకలుస్తది, రైతు జీవితం ఆగమైతది అన్నారు. రాబోయే రోజుల్లో పిల్లలమర్రి, ఉర్లుగొండ, లింగమంతా స్వామి గుట్ట లు , మూసి ప్రాజెక్ట్ ల సమూహం తొ సూర్యాపేటను టూరిస్ట్ హభ్ గా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. మూసీ ప్రాజెక్ట్ లో 
బోట్ హౌజ్ ల నిర్మాణంతో మూసీ ప్రాజెక్టుకు నూతన శోభను తెచ్చి పర్యాటకు స్వర్గధామంగా చేస్తానని తెలిపారు.యువతకు ఉపాధి  కల్పించడమే లక్ష్యంగా రాబోయే పాలన  ఉంటుందన్నారు. స్వచ్ఛమైన తాగునీరు, కడుపునిండా కరెంట్, సుందరమైన రహదారులు ఇలా ప్రజలకు చెప్పిన హామీలన్నీ కూడా నెరవేర్చాను అని అన్నారు.
జగదీష్ రెడ్డి ఏం చేసిండు అన్న దామోదర్ రెడ్డి? జగదీష్ రెడ్డి వచ్చాకే , నాలుగు గంటల కరెంటు మూసి మురికి నీరు పోయి స్వచ్ఛమైన తాగునీరు, కళ్యాణ లక్ష్మి, రైతుబంధు, రైతు బీమా ,కేసీఆర్ కిట్ వచ్చాయని అన్నారు.
మళ్లీ ఆశీర్వదిస్తే  సూర్యాపేటకు  వెయ్యి ఎకరాలలో డ్రైపోర్ట్, ఇండస్ట్రియల్ పార్క్, ఐటీ పరిశ్రమను విస్తరించి 20 వేల మంది  కి పైగా యువతీ యువకులకు ఉపాధి కల్పిస్తానని తెలిపారు. దీనితోపాటు సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి పేద మహిళలకు నెలకు 3000 పెన్షన్, భూమిలోని నిరుపేదలకు ఐదు లక్షలతో కేసీఆర్ భీమా, 400కే గ్యాస్ సిలిండర్, రేషన్ బియ్యం ద్వారా సన్న బియ్యం పంపిణీ, ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇంటి నిర్మాణం, ఆసరా దివ్యాంగుల పెన్షన్ పెంపు, మహిళా సమాఖ్యలకు సొంత భవన నిర్మాణాలు, అగ్రవర్ణ పేదలకు గురుకులాలు, రైతుబంధు 16,000 చేసి నూటికి నూరు శాతం అమలు చేస్తామన్నారు. ఆశీర్వదించండి .. ఓటు వేసిన వారు గర్వపడేలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.