శాసనసభ్యులు జగదీష్ రెడ్డి ఆద్వర్యం లో

శాసనసభ్యులు జగదీష్ రెడ్డి ఆద్వర్యం లో
  • సూర్యాపేట లో కన్నుల పండుగగా మహా పడిపూజ.. 
  • పోటెత్తిన భక్త జన సందోహం..
  •  వైభవంగా అయప్ప మహా పడిపూజ
  • వెల్లివిరిసిన ఆధ్యాత్మికత 
  • అయ్యప్ప శరణు ఘోషతో మారుమోగిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-అయ్యప్ప దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దాని వల్ల మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం లభిస్తుందని సూర్యాపేట శాసన సభ్యులు, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. స్వామియే శరణం అయ్యప్పా..శరణం శరణం అయ్యప్పా..స్వామి శరణం అయ్యప్పా అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణ తో సూర్యాపేట క్యాంపు కార్యాలయం మార్మోగింది.స్థానిక శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి-  సునీత దంపతుల ఆధ్వర్యంలో క్యాంపు కార్యాలయం అవరణలో   శ్రీ అయ్యప్పస్వామి మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. సూర్యాపేట కు చెందిన గురుస్వాముల నేతృత్వంలో జరిగిన ఈ పూజా కార్యక్రమంలో జగదీష్ రెడ్డి  కుటుంభసభ్యులు,వేలాది మంది అయ్యప్పస్వాములు, భక్తులు , బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొని అయ్యప్ప నామస్మరణ, భజన పాటలు, భక్తి గీతాలను ఆలపించారు..అనంతరం స్వాములకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ..అకుంఠిత దీక్ష, అంతులేని ఆత్మవిశ్వాసంతో సన్నిధానానికి చేరుకొని స్వామిని దర్శించడమే అయ్యప్ప దీక్షలోని ఆంతర్యం అన్నారు.41 రోజుల పాటు కఠోర నియమాలు పాటిస్తూ, నిష్టగా పూజాది కార్యక్రమాలు ఆచరించే భక్తులకు పవిత్రమైన రోజులన్నారు. తనువు, మనస్సును చెడు నుంచి మంచి మార్గం వైపు మళ్లించే గొప్ప  శక్తి ఈ దీక్ష కు ఉందన్నారు. ఈ దీక్ష కఠోర నియమాలతో కూడుకున్నప్పటికీ, దీక్ష వల్ల వచ్చే మానసిక ఆనందం, ఆత్మ పరిశీలన శక్తి, అపూర్వమైన ఆధ్యాత్మిక ఆనందం దీక్షాపరులకు అనుభవంలోకి వస్తాయన్నారు.శివునికి ప్రీతిపాత్రమైన కార్తీకమాసంలో కఠిన నియమ, నిష్టలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలం అన్నారు.ఆధ్యాత్మిక చింతన, ఆరోగ్య నియమాల కలబోత  మాలధారణ అన్నారు.స్వామివారి పడిపూజ మహోత్సవం నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రజలపై అయ్యప్ప స్వామివారి కృప, చల్లనిచూపు తప్పక ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. సతీష్   అయ్యగారు నేతృత్వంలో రాచకొండ దేవయ్య, శ్రీనివాస్ రెడ్డి, నారయణ వెంకట్ రెడ్డి, ఏర్రం శెట్టి ఉపెందర్, జేపిటి సమక్షం లో పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి.