కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శిగా దేవేందర్ 

కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శిగా దేవేందర్ 

మహాదేవపురం, ముద్ర: బొమ్మపూర్ గ్రామానికి చెందిన పుప్పిరెడ్డి దేవేందర్ ను కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి గా నియమిస్తూ మండల పార్టీ అధ్యక్షులు ఎండి అక్బర్ ఖాన్ నియామక పత్రాన్ని అందజేశారు. మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, శ్రీను బాబుల నిర్దేశాను సారం ఈ నియామకం జరిగినట్లు అక్బర్ ఖాన్ తెలిపారు. కాంగ్రేస్ పార్టీ గెలుపు కోసం, శ్రీధర్ బాబును అత్యధిక మెజారిటీతో గెలిపించడమే లక్ష్యంగా కృషి చేయాలని అక్బర్ ఖాన్ కోరారు. ఈ కార్యక్రమంలో నెన్నెల గట్టయ్య, మేసినేని రవిచంద్ర, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.