ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన అభివృద్దే !!

ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన అభివృద్దే !!
  • వారిని మళ్ళీ గెలిపిస్తుంది !!
  • సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి

ముద్ర, శాయంపేట: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి చేసిన అభివృద్దే వారిని మళ్ళీ గెలిపిస్తుందని ధీమా వ్యక్తం చేసిన పత్తిపాక గ్రామ సర్పంచ్ చిట్టిరెడ్డి రాజిరెడ్డి. భూపాలపల్లిని నగరపంచాయతీగా, పురపాలక సంఘంగా,  జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేసిన ఘనత గండ్ర వెంకటరమణరెడ్డికే దక్కుతుందని అన్నారు. ప్రతి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, జిల్లా కేంద్రంలో వందపడకల ఆసుపత్రిని అభివృద్ధి పరిచరన్నారు. జిఎంఆర్ఎం ట్రస్ట్ ద్వారా యువతకి ఉపాధి కల్పించారని అన్నారు , ట్రస్ట్ ద్వారా అనేక  సేవకార్యక్రమాలు చేస్తూ, పేదలకు అండగా నిలుస్తున్నారని  కొనియాడారు. వారికి  ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసారు.  మరింత అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.