విద్యుత్ ఘతం వల్ల  కాలిన పత్తి

విద్యుత్ ఘతం వల్ల  కాలిన పత్తి

అధిక లోడుతో వెళుతున్న లారీ తగిలి తెగిన విద్యుత్ తీగలు
రేగొండ మండలం జగ్గయ్యపేట గ్రామంలో TS 05 UC 2339 నంబర్ గల లారీ అధిక లోడు వడ్ల బస్తాలతో  రేగొండ మండలం జగ్గయ్యపేట గ్రామములో రోడ్డుపై వెళ్తున్న క్రమంలో కరెంటు వైర్లను తాకడంతో స్తంభాలు విరిగి రోడ్డు పై పడటంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంను గమనించిన  స్థానిక సర్పంచ్ పాతపల్లి సంతోష్, వార్డు మెంబర్ మూడు అశోక్ రెడ్డి, స్పందించి స్థానిక పోలీసులకు,ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. ఈ ప్రమాదంలో రోడ్డుకిరువైపులా వైర్లు ముక్కలుగా తెగిపడి రోడ్డుపై పడటామ్ వల్ల  మంటలు వ్యాపించాయి.

అంతేకాకుండా గ్రామంలోని రైతు మసాడి ముత్యంరావు ఇంట్లో పత్తి నెట్టు కొట్టుచున్న క్రమంలో మంటలు వ్యాపించి తన ఇంట్లో ఉన్న ఐదు క్విటాళ్ల పత్తి పూర్తిగా కాళీ బుడుద ఐయ్యింది.రైతు తో పాటు చుట్టుపక్కల వారు మంటలను అదుపు చేయడంతో మంటలు తగ్గాయి. అంతేకాకుండా గ్రామంలోని వీధిలైట్లు మొత్తం కాలిపోయినట్లు గ్రామానికి చెందిన జూనియర్ లైన్ మెన్ శ్రావణ్,సర్పంచ్ తెలియజేశారు. మంటల వల్ల జరిగిన  నష్టానికి తగిన సహాయం అందించాలని కోరారు.