అటు ఇటు చూడొద్దు.. ఆగం కావొద్దు..

అటు ఇటు చూడొద్దు.. ఆగం కావొద్దు..
  • కారు గుర్తుకు ఓటెయ్యాలి..
  • భూపాలపల్లిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ప్రచారం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: అటు ఇటు చూడొద్దు.. ఆగం కావొద్దు.. అభివృద్ధి చేసిన కారు గుర్తుకు ఓటెయ్యాలని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీలు సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్యలు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు బాంబుల గడ్డ, సీఆర్ నగర్ తో పాటు గణపురం మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యలు పాల్గొని మాట్లాడుతూ సీఆర్ నగర్, బాంబుల గడ్డ ప్రాంతాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందన్నారు. ప్రధానంగా నీళ్ల సమస్య, డ్రైనేజీ సమస్య తీర్చడం జరిగిందని తెలిపారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో  బాంబుల గడ్డ ప్రాంతానికి చెందిన 40మంది  నిరిపేద ప్రజలకు ఇళ్ళు అందించడం జరిగిందని వివరించారు. ఈ ప్రాంతాన్ని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని, అందుకు నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అందరు కారు గుర్తుకు ఓటువేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. రానున్న రోజుల్లో గృహాలక్మి పథకం ద్వారా అర్హులైన అందరికి ఇళ్ల నిర్మాణము చేపట్టడం జరుగుతుందని, మెనిఫెస్టో ఆధారంగా సంక్షేమ పథకాలు పెరుగుతాయని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరవుతాయని వారు వివరించి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.