మహాత్ముని సందేశం జీవనానికి ఆదర్శం

మహాత్ముని సందేశం జీవనానికి ఆదర్శం

మహాదేవపూర్, ముద్ర: శాంతి, అహింస, సత్యం, విలువలతో కూడిన జీవనాన్ని గాంధీ మహాత్ముడు ప్రపంచానికి అందించాడని, దేశ స్వాతంత్ర ఉద్యమ సేనానిగా వ్యవహరించి తెల్ల దొరలను పారద్రోలిన ధీశాలి అని ఆవోప నాయకుడు దారం రాజబాపు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో గాంధీజీ విగ్రహానికి ఆవోపా డివిజన్ అధ్యక్షుడు దారం శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులు అర్పించారు. పెండ్యాల మనోహర్, ఆన్కారి ప్రకాష్, ప్రభాకర్, గుడాల శ్రీనివాస్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.గణపతి చౌక్ లో వైశ్య సంఘం మాజీ అధ్యక్షులు దేవేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి ఉత్సవాలలో జెడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపిపి రాణిబాయి, విండో ఛైర్మన్ చల్ల తిరుపతి రెడ్డి, సర్పంచ్ శ్రీపతి బాపులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గీతాబాయి, ఆకుల శ్రీధర్, నర్సిన కృష్ణ, జగదీష్ లు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అధ్యక్షులు అక్బర్ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కోట రాజబాపు, జెడ్పీటీసీ అరుణ, ఎంపీపీ రాణిబాయి, వామనరావు, ఆకుతోట సుధాకర్, వరప్రసాద్, సోహైల్ కార్యకర్తలు  పాల్గొన్నారు.