బీసీ బంధు ప్రకటించకుంటే.. బిఆర్ఎస్ కు గుణపాఠం నేర్పుతాం- వేముల మహేందర్ గౌడ్

బీసీ బంధు ప్రకటించకుంటే.. బిఆర్ఎస్ కు గుణపాఠం నేర్పుతాం- వేముల మహేందర్ గౌడ్

ముద్ర, మొగుళ్లపల్లి : జనాభాలో సగభాగానికి పైగా ఉండి..ఆర్థికలేమితో కష్టపడుతూ..నిరంతర శ్రమను..పన్నుల రూపాన ప్రభుత్వానికి ఖజానాను సమకూరుస్తున్న బీసీలకు బీసీ బంధు ప్రకటించకపోతే.. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి, బిఆర్ఎస్ అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడిస్తామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ హెచ్చరించారు. బీసీలలో అనేక కులాలు ఉన్నప్పటికీ..ఒక లక్ష రూపాయల సబ్సిడీతో కేవలం 15 కులాలకు చెందిన వారికే బీసీ రుణాలంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీలను మరోసారి మోసం చేసేందుకు కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. బీసీలను విడగొట్టి..ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చేందుకు పన్నాగం పన్నుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ నాటకాలను బీసీ కులాస్తులంతా గమనించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీసీ బంధు ఏ పార్టీ ప్రకటిస్తే..ఆ పార్టీకి బీసీల మద్దతు ఉంటుందన్నారు. శ్రమ చేసేది మేమైతే..మా శ్రమతో పన్నుల రూపాన వచ్చే.. ఖజానాను కొల్లగొట్టి రాజ భోగాలు అనుభవించేది మీరా అని ఆయన ప్రశ్నించారు.