టీఎస్ డబ్ల్యుఆర్ఎస్ లో దరఖాస్తులకు ఆహ్వానం..

టీఎస్ డబ్ల్యుఆర్ఎస్ లో దరఖాస్తులకు ఆహ్వానం..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి ఈ నెల 20 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా సమన్వయ అధికారి గొల్కోండ బిక్షపతి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి గురుకుల ప్రవేశాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, పాఠశాలలో ఐదో తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తునట్లు తెలిపారు.

విద్యార్థులు జనవరి 20 లోగా ఆన్లైన్లో వంద రూపాయలు రుసుము చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఐదో తరగతి ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 11న ఉంటుందని, వివరాలకు https://tgcet.cgg.gov.in లో, ఇంటర్ కొరకు ఈ నెల 20లోగా ఆన్లైన్లో రెండు వందల రూపాయలు చెల్లించి అప్లై చేసుకోవాలన్నారు. ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 4న ఉంటుందని, వివరాలకు https://tsswreisjc.cgg gov.in నందు సంప్రదించాలని జిల్లా కో ఆర్డినేటర్ గోల్కొండ బిక్షపతి తెలిపారు.