పేదలకు ఇంటి స్థలంతో పాటు 6 లక్షలు చెల్లిస్తాం

పేదలకు ఇంటి స్థలంతో పాటు 6 లక్షలు చెల్లిస్తాం

చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి మేడిపల్లి సత్యం ముద్ర ప్రతినిధి కరీంనగర్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలకు ఖాళీ స్థలం ఉంటే ఆరు లక్షల రూపాయలు చెల్లిస్తామని చొప్పదండి నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ మేడిపల్లి సత్యం అన్నారు. ఆదివారం రామడుగు మండలంలోని కొక్కెర కుంట ,వన్నారం గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా మద్దత్తు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామన్నారు.

అంబేద్కర్ అభయ హస్తం పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని పేర్కొన్నారు. ఇందిరమ్మ పక్క ఇళ్ల పథకం కింద ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షల రూపాయలు అందజేస్తామని వెల్లడించారు. ఐదేళ్లలో అర్హులైన ప్రతి ఒక్క ఎస్సీ ఎస్టీ కుటుంబానికి పథకం వర్తింప చేస్తాం అన్నారు. మహిళలకు ఆర్టీసి బస్సులో ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర చెల్లిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొమ్మరవెణి తిరుపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న, కొల రమేష్ , జవ్వాజి హరీష్, పంజాల శ్రీనివాస్, ఓం ప్రకాష్,కట్ల శంకర్, రంగు గోపాల్,లక్ష్మణ్ , శ్యామ్ సుందర్,అజయ్ , మహేష్, వంశీ, శ్రీనివాస్, భారత్,పులి అంజయ్య,తదితరులు పాల్గొన్నారు.