తెలంగాణ లో  అద్భుత ప్రగతి సాధించిన వైద్య రంగం...

తెలంగాణ లో  అద్భుత ప్రగతి సాధించిన వైద్య రంగం...

సీ పీ ఆర్ శిక్షణ కేంద్రం ప్రారంభోత్సవం లో...
మంత్రి హరీశ్ రావు, కేటీఆర్...
ముద్ర ప్రతినిధి, మేడ్చల్: బీ ఆర్ ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఫలితం గా నేడు మన రాష్ట్రం లో వైద్య రంగం అద్బుత ప్రగతి సాధించి దేశానికే తలమానికంగా నిలిచిందనీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న  అసహజ మర ణాలను తగ్గించే ప్రయత్నం లో భాగం గా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో  సీ పీ ఆర్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది . మేడ్చల్ జిల్లా లోని కొంపల్లి ప్రాంతం లో గల ఈ ఎం ఆర్ ఐ ప్రధాన కార్యాలయంలో నిర్వహిస్తున్న ఈ శిక్షణ శిబిరాన్ని బుధవారం మంత్రి హరీశ్ రావు కెటిఆర్ తో కలిసి లాంఛనం గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన దేశంలో ఏటా సుమారు 15 లక్షల మంది ఆకస్మిక గుండె పోటుకు గురవుతున్నారని తెలిపారు. సకాలంలో వైద్యం అందక వీరిలో 4 లక్షల మంది చని పోతున్నట్లు మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. మన రాష్ట్రం లో ను ప్రతి సంవత్సరం సుమారు 24 వేల మంది చనిపోతున్నారని తెలిపారు.

సీ పీ ఆర్ ప్రక్రియ చేయడం ద్వారా ఇలా ఆకస్మికంగా చనిపోతున్న వారిలో కొందరి నైనా కాపాడ వచ్చని హరీశ్ రావు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల విలువైన ప్రాణాల ను కాపాడాలని మంచి ఉద్దేశ్యం తోసీ పీ ఆర్ శిక్షణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ట్లు తెలిపారు. ముందుగా వైద్య,మున్సిపల్ , పోలీస్ శాఖలలో పనిచేసే సిబ్బంది కి ఈ సీ పీ ఆర్ ప్రక్రియలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ప్రభుత్వం రూ.18 కోట్ల తో ఆధునిక ఏ ఈ డి పరికరాల ను కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. వీటిని జన సంచారం ఉండే బస్ స్టాప్ లు, షాపింగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేయ నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కే టీ అర్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం వైద్య రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం వల్లనే ఈ రోజు దేశం లోనే వైద్య రంగం లో ముందంజ లో ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లా రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక సీ ఎస్ అరవింద్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రీజ్వి, డైరెక్టర్ శ్రీనివాస్ రావు, శ్వేత మహంతి, ఎమ్మెల్సీ శంబీపుర్ రాజు, ఏర్రొల శ్రీనివాస్ తదతరులు పాల్గొన్నారు.