మారోజు వీరన్న వర్ధంతి సభ పోస్టల్ ఆవిష్కరణ

మారోజు వీరన్న వర్ధంతి సభ పోస్టల్ ఆవిష్కరణ

ముద్ర తిరుమలగిరి:ఈ నెల 16 న తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో జరిగే ఇండియా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్టు పార్టీ సిపియుఎస్ఐ వ్యవస్థాపకులు పీడిత ప్రజల ఆశాజ్యోతి మారోజు వీరన్న 24వ వర్ధంతి సభను విజయవంతం చేయాలని కోరుతూ సోమవారం సాయంత్రం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని సంతలో ఏపూరి సోమన్న కళామండలి ఆధ్వర్యంలో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ టి పి  రాష్ట్ర అధికార ప్రతినిధి తుంగతుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ఏపూరి కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ఏపూరి సోమన్న మాట్లాడుతూ తుంగతుర్తి నియోజకవర్గం లోని కొత్తగూడెం గ్రామంలో జన్మించిన మారోజు వీరన్న దళిత బహుజన హక్కుల కోసం వారి అశయ సాధన కోసం పీడిత ప్రజల హక్కుల కోసం నిరంతరం శ్రమిస్తూ గత 24 సంవత్సరాల క్రితం ఎన్కౌంటర్లో మృతి చెందాడని ఆయన అన్నారు.

ఆయన ఆశయ సాధన కోసం ఈనెల 16న తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని సంత ఆవరణ జరిగే మారోజు వీరన్న వర్ధంతి సభను విజయవంతం చేయాలని అనుకోరారు ఈ కార్యక్రమానికి ప్రజా యుద్ద నౌక గద్దర్  ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ  సిపిఐ జాతీయ నాయకులు నారాయణ  ప్రొఫెసర్ కోదండరాం. ప కాశీం. బిసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ రేలా రేలా గంగా మధుప్రియ వైఎస్ఆర్ టిపి నాయకులు పిట్ట రామిరెడ్డి గట్టు రామచంద్రరావు తదితరులు హాజరు కానున్నారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కడెం లింగయ్య బీసీ సంఘం రాష్ట్ర నాయకులు రాంబాబు పో రేళ్ళ విప్లవకుమార్ తదితరులు పాల్గొన్నారు