రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు

రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు
  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : రాజకీయాలకతీతంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీసీ బందు ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కెసిఆర్ కిట్టు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, న్యూట్రిషన్ కిట్ మాదిరిగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకతీతంగా ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తున్నామని ఆయన అన్నారు. సామాన్యులకు అండగా నిలవాలన్నదే కేసీఆర్ ఆలోచన అని కులవృత్తులకు ఉపాధి లభించడం లేదని అందుకే వారందరికీ లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాలన్నదే ప్రభుత్వం ఉద్దేశమని ఆయన తెలిపారు. దశలవారీగా అందరికీ లక్ష రూపాయలు అందుతాయని ఆయన అన్నారు. పనిచేసుకునే ప్రతి చేతికి పని కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు 9 ఏళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ అదే లక్ష్యంతో పని చేస్తున్నారని తెలంగాణ నుండి వలసలు ఆగిపోయాయని ఇతర రాష్ట్రాల నుండి వలసలు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారని ఆయన తెలిపారు. అన్నార్తులకు అండగా నిలువాలనా ఉద్దేశంతో ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని దివ్యాంగులకు పెన్షన్ 416కు పెంచడం జరిగిందని వనపర్తి నియోజకవర్గంలో 651 మందికి లబ్ధి చేకూరుతుందని ఆయన అన్నారు.

రైతులను నిలబెట్టాలన్న సంకల్పంతో ఉచిత విద్యుత్తు రైతు బీమా రైతు బంధు సాగునీరు ఇస్తూ పండించిన పంటను కొనుగోలు చేస్తూ అండగా నిలుస్తూ వ్యవసాయం బాగుపడడంతో దాని చుట్టూ అల్లుకున్న రంగాలు నిలదొక్కుకుంటున్నాయని ఆయన అన్నారు. వ్యవసాయ రంగం బలపడడంతో అనుబంధ రంగాలన్నీ అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని ఆయన తెలిపారు.  ఒకనాడు పది ఎకరాల రైతు కూడా తిండికి తిప్పలు పడేవారని ఆ పరిస్థితి నుండి గట్టెక్కడం తెలంగాణ సాధించిన విజయమని ఆయన అన్నారు. సమాజంలో వెనుకబడిన వారికి కార్పొరేషన్ల ద్వారా చేయితన అందిస్తున్న దేశంలోనే ఆదర్శ రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు చేయితన అందించాలని అండగా నిలవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా 395 మందికి రూపాయలు 3.95 కోట్ల విలువైన బీసీ బందు ప్రసిడెంట్ ను 361 మంది దివ్యాంగులకు పెంచిన పింఛన్లు 316 నుండి 416 ప్రొసీడింగ్స్ ను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర సహకార సంస్థల చైర్మన్ రాజా వరప్రసాదరావు, జడ్పీ చైర్మన్ లోక్నాథ్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, ఎంపీపీలు, జడ్పిటిసిలు సర్పంచులు సింగిల్ విండో చైర్మన్లు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.