డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు - 18 బిల్లులను ప్రవేశ పెట్టనున్న కేంద్రం..

డిసెంబర్‌ 4 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు - 18 బిల్లులను ప్రవేశ పెట్టనున్న కేంద్రం..

న్యూఢిల్లీ: పార్లమెంట్​ శీతాకాల సమావేశాలు డిసెంబర్​ 4 నుంచి 22 వరకు కొనసాగ నున్నాయి. ఈ సమావేశాల్లో 18 బిల్లులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది..

ఇందులో రెండు జమ్మూకశ్మీర్​, పుదుచ్చేరి లలో మహిళా రిజర్వేషన్ల వర్తింపు బిల్లులు, ఐపీసీ స్థానంలో తెచ్చే మూడు నేర శిక్షాస్మృతి బిల్లులు ఉన్నాయి. ఈ మేరకు లోక్​సభ సెక్రటేరియట్​ బులెటిన్​ విడుదల చేసింది.శీతాకాల సమావేశాల్లో జమ్మూకశ్మీర్​ అసెంబ్లీ లో ఉన్న సీట్ల సంఖ్యను 107 నుంచి 114 కు పెంచే బిల్లు పార్లమెంట్​ ముందుకు రానుంది. దీనివల్ల కశ్మీర్​ నుంచి వలస వెళ్లిన వారికి, శరణార్థులకు, ఎస్టీ లకు చట్ట సభలో ప్రాతినిథ్యం లభించనుంది. 

ఈ బిల్లులతో పాటు 2023-24 కు సంబంధించి సప్లిమెంటరీ గ్రాంట్ల పై సమావేశాల్లో చర్చ, ఓటింగ్​ జరగనుంది..

ఐపీసీ చట్టాల స్థానంలో ద భారతీయ న్యాయ సంహిత, ద భారతీయ నాగరిక సురక్ష సంహిత, ద భారతీయ సాక్ష్య బిల్లును కేంద్రం తీసుకొస్తుంది.మరోవైపు, సమావేశాల ప్రారంభానికి ముందు డిసెంబర్​ 2 న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్​ జోషి తెలిపారు..