ఘనంగా మాణిక్ ప్రభు జాతర ఉత్సవాలు

ఘనంగా మాణిక్ ప్రభు జాతర ఉత్సవాలు

పెద్దశంకరంపేట, ముద్ర: మండల పరిధిలోని మక్త లక్ష్మాపూర్ గ్రామంలో గురువారం నుండి మాణిక్ ప్రభు జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలు పెద్ద ఎత్తున బోనాలు సమర్పించారు. బండ్ల ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.