గజ్వేల్ నుండి గద్దర్ పొటిని స్వాగతిద్దాం

గజ్వేల్ నుండి గద్దర్ పొటిని స్వాగతిద్దాం

డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్

సిద్దిపేట: ముద్ర ప్రతి నిధి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికలలో ప్రజా యుద్ద నౌక గద్దర్ పోటి చెయాడానికి ముందు కు రావడం పట్ల ప్రతి ఒక్కరూ స్వాగతించాల్సిన అవసరం ఎంతో వుందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యయ పి.శంకర్ అన్నారు.గద్దర్ తన జీవితాంతం ప్రజలను తన ఆట పాట ద్వారా ప్రజలను చైతన్యం చెసిన గద్దర్ ఎన్నికల రంగంలో అడుగుపెట్టడం చారిత్రాత్మకమైన నిర్ణయమన్నారు.స్వతంత్రంగా గద్దర్ పోటి చెస్తే గెలుపు కొసం ప్రయత్నం చెస్తామన్నారు.ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెట్ల శంకర్, రాష్ట్ర కార్యదర్శి దాసరి ఎగొండ స్వామి,రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబాషి సంజివ్,ముత్యాల భూపాల్, జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు,రాజు తదితరులు పాల్గొన్నారు.