నవమాసాలు మోసి కని.. రోడ్డు మీద విసిరేసిన కసాయి తల్లి 

నవమాసాలు మోసి కని.. రోడ్డు మీద విసిరేసిన కసాయి తల్లి 
  •  విఠ్యాలలో సంఘటన 
  •  ప్రజల సమాచారంతో బిడ్డను కాపాడిన పొలీసులు 
  •  బాబు కాలిపై మిస్బా సన్ అఫ్ అమీర్ ట్యాగ్ 

ముద్ర, షాద్‌నగర్: క్షణకాలం పాటు చేసే పాపంవల్ల నవమాసాలు మోసి ఆపై బిడ్డను కని తమకేమీ సంబంధం లేదన్నట్లుగా చాలామంది తల్లులు వ్యవహరిస్తున్నారు. సమాజంలొ ఆడపిల్లలైతే కనడం వరకే బాధ్యత తీసుకుని ఆపై ఏ చెత్త బుట్టలోనో, ఏ ముళ్లకంపల్లోనో వదిలి వెళ్లిపోతున్నారు. ఏ మాత్రం దయా జాలి లేకుండా వ్యవహరిస్తున్నారు కొందరు కసాయి తల్లులు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజక వర్గం ఫరూక్ నగర్ మండలం విఠ్యాల వద్ద ఓ బుజ్జాయి బాబుని వదిలి వెళ్లిపోయింది కసాయి తల్లి.

ఈ హృదయవిదారకమైన దృశ్యం చాలామందిని కదిలించింది. తల్లి వదిలి వెళ్లిపోవడంతో పాపకు ఆకలైందో ఏమో తెలియదుగానీ ఏడవటం మొదలు పెట్టింది. చిన్నారికి తల్లి తోడు లేకపోయిన పిల్లలు భగవంతుడితో సమానం అంటారు కాబట్టి ఆ భగవంతుడే ఆ బిడ్డకు అండగా నిలిచాడు. స్థానికులు పాప ఏడుపు విని రోడ్డు పక్కన చూస్తే చిన్నారి దృశ్యం కనబడడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు అప్పటికి పసిక అందుకు అండగా నిలిచి ఎత్తుకున్నారు మహిళలు ఆ బాబుకు పాలు తాపారు. బాబు కాలిపై మిస్బా సన్ అఫ్ అమీర్ ట్యాగ్ వేసి ఉంది పోలీసులు ప్రాథమిక సమాచారం సేకరించారు.