పెద్దశంకరంపేటలో కాంగ్రెస్  సంబరాలు

పెద్దశంకరంపేటలో కాంగ్రెస్  సంబరాలు

పెద్దశంకరంపేట, ముద్ర: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం పట్ల పెద్దశంకరంపేటలో మండల కాంగ్రెస్ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. శనివారం ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు బాణాసంచా కాల్చి,  ఒకరికి ఒకరు స్వీట్లు తిని పించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఓబీసీ ప్రధాన కార్యదర్శి జనార్దన్, జిల్లా, మండల, కాంగ్రెస్ నాయకులు రాయని మధుసూదన్,  రాజేంద్ర గౌడ్, గంగారెడ్డి,  కాయత సాయిలు, జైహింద్ రెడ్డి, జైపాల్, జహంగీర్, మల్లేశం, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.