22 మంది మైనారిటీ మహిళలకు మైనార్టీ బంద్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే

22 మంది మైనారిటీ మహిళలకు మైనార్టీ బంద్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే
  • రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన తోటే అన్ని వర్గాలకు సమన్యాయం
  • వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ ఖాయం ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ 
  • తుంగతుర్తి లో మూడోసారి గులాబీ జెండా రెపరెపలాడించడం ఖాయం

తుంగతుర్తి ముద్ర: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో అన్ని వర్గాల వారికి అన్ని మతాలు కులాల వారికి సమచిత న్యాయం చేస్తూ అభివృద్ధి సంక్షేమ పాలన కొనసాగిస్తునారని తుంగతుర్తి శాసనసభ్యులు డాక్టర్ కిషోర్ కుమార్ అన్నారు .మంగళవారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో 22 మంది మైనార్టీ మహిళలకు మైనార్టీ బంద్ చెక్కులను అందించిన సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అందులో భాగంగానే దళిత బంధు, బీసీ బందు ,మైనార్టీ బందు,లను ప్రవేశపెట్టారని అన్నారు .దళిత బంధుతో వేలాది మంది దళిత యువకులు నేడు ఉపాధి పొందారని ఇంకా దళిత బంధు లబ్ధిదారులకు సహాయం చేయడానికి ప్రభుత్వం పథకాన్ని కొనసాగిస్తుందని అన్నారు .ఇటీవలనే వెనుకబడిన తరగతుల వారికి చేయూత కోసం బీసీ బందు ప్రవేశపెట్టి ఒక లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని అన్నారు .అలాగే ముస్లిం మైనార్టీలకు మైనార్టీ బందును ప్రవేశపెట్టి ఒక లక్ష ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుందని అన్నారు .

ముఖ్యమంత్రి సదుద్దేశంతో అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని ఉపయోగించుకుని దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారు ఆర్థికంగా స్థిరపడాలని కోరారు. అంతేకాకుండా నాడు ఎన్నికల ముందు చెప్పకుండా మేనిఫెస్టోలో ప్రవేశపెట్టకుండా ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తున్నారని అన్నారు .తుంగతుర్తి నియోజకవర్గం ఈనాడు ఇంత అభివృద్ధి చెందిందంటే అది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వల్ల ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన వల్ల నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యేగా తాను కొనసాగడం వల్లనేనని అన్నారు .గతంలో ఏనాడు లేని అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా అందుతున్నాయని అందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొంతమంది తాము అభివృద్ధి చేస్తామని వస్తున్నారని ఒకసారి గతాన్ని గుర్తు చేసుకోవాలని తుంగతుర్తి ప్రాంత భూములు ఈనాడు ఆకుపచ్చ రంగుతో ఎంతో అందంగా ఆనందంగా కనబడుతున్నాయని ఎండిపోయి నెర్రెలు బాసిన చెరువుల కుంటలు గోదావరి జలాలతో నిండుకుండల్లా కనబడుతున్నాయని ఇది అభివృద్ధి కాదా అనివిపక్ష నేతలకు చురకలంటించారు.

కళ్ళ ముందు అభివృద్ధి కనబడుతుంటే అది అభివృద్ధి కాదని తాము ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు .నియోజకవర్గంలో 2014కన్న వెనుక పరిస్థితి  2014ఎన్నికల అనంతరం పరిస్థితిని తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలు గుర్తు చేసుకోవాలని మళ్లీ పాత పాలన కావాలంటే అరాచకం ప్రబలాలంటే అలాంటి వారితోనే సాధ్యమవుతుందని అభివృద్ధి సంక్షేమం నియోజకవర్గంలో నిరంతరం పాడిపంటలు పొంగిపొర్లాలంటే బి ఆర్ ఎస్ పాలనతోనే సాధ్యమవుతుందని అందుకే ప్రజలు ముచ్చటగా మూడోసారి తుంగతుర్తి లో గులాబీ జెండా ఎగరవేసి మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్  ముఖ్యమంత్రి స్థానంలో చూడాలని ప్రజలకు పిలుపునిచ్చారు .రానున్న కాలంలో రానున్న ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలతో పాటు రాష్ట్రంలో అత్యధిక స్థానాలు టిఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఇందులో ఎలాంటి అనుమానం లేదని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.