కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు

కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా : నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వంశీ కృష్ణ నిర్వహించిన మీడియా సమావేశంలోనే మాజీ మంత్రి డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కుమారుడు రాజేష్ రెడ్డి వర్గాల నేతలు ఒకరినొకరు తిట్టుకున్నారు.  యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం సందర్భంగా జిల్లా అధ్యక్షులు తోపాటు మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డి తనయుడు నాగం శశిధర్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచుకుళ్ళ దామోదర్ రెడ్డి కుమారుడు కుచుకుళ్ల రాజేష్ రెడ్డిలు హాజరయ్యారు. వీరితో పాటు ఇరువు వర్గాల ముఖ్య నేతలు హాజరయ్యారు.

యూత్ కాంగ్రెస్ జెండా ఆవిష్కరణ అనంతరం మీడియా సమావేశంలో కూర్చుంటున్న క్రమంలో అప్పటికే ముందు వరసలో కూర్చున్న నాగం వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు భీముడుని కుచుకుల్ల దామోదర్ రెడ్డి వర్గానికి చెందిన గట్టు నెల్లికుదురు గ్రామ ఎంపిటిసి చెన్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పనికిమాలినోళ్లు అంటూ దూషించాడు. దీంతో ఇరువురి మధ్య మాట పెరిగి ఒకరినొకరు దూషించుకున్నారు. వెంటనే పార్టీ నేతలు వారిరువురిని గద్దిస్తూ బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. ఇదంతా జిల్లా అధ్యక్షుడు ముందే జరగడంతో రెండు వర్గాల మధ్య విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి కుమారుడు ఈ నెల 3న జూపల్లితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. కాగా పార్టీ అధిష్టానం ఆదేశాలను బేకాతర చేస్తూ వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ మాకే అంటూ కూచుకుల్ల వర్గం ప్రచారం చేసుకోవడంతో రెండు వర్గాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని పార్టీ నేతలు కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.