నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

ముద్ర,తెలంగాణ:- గ్రూప్-1 పోస్టులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మరో 60గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఏప్రిల్ 2022లో 503 పోస్టుల భర్తీకి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే.పేపర్ లీకేజీల కారణంగా రెండుసార్లు పరీక్షను రద్దు చేశారు. గతంలో ప్రకటించిన 503పోస్టులకు మరో 60 కలిపి మొత్తం ఖాళీల భర్తీ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.ఆర్థిక, హోం, లేబర్‌ అండ్‌ ఎంప్లాయ్‌మెంట్‌, పంచాయత్‌ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ శాఖల్లోని పోస్టులను కలిపి 60పోస్టులను పాత నోటిఫికేషన్‌లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం పోస్టులకు వీలైనంత త్వరలో నోటిఫికేషన్ ఇవ్వాలని తెలంగాణ సర్కార్‌ టీఎస్‌పీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.