త్రాగునీరు అందించాలని మహిళల ధర్నా..

ముద్ర ప్రతినిధి, జయశంకర్ భూపాలపల్లి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ న్యూ ఎస్సీ కాలనీలో తాగునీరు అందించాలని కోరుతూ మంగళవారం మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బాధిత మహిళలు మాట్లాడుతూ తమ కాలనీకి గత 15 రోజులుగా త్రాగునీరు అందించకుండా అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. 15 రోజులుగా నీళ్లు రాకపోవడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అన్నారు. వెంటనే అధికారులు పాలకులు స్పందించి తమకు త్రాగునీరు అందించాలని వారు డిమాండ్ చేశారు.