సామాజిక ఆసుపత్రి పరిస్థితిపై జడ్పీ చైర్మన్ గరం

సామాజిక ఆసుపత్రి పరిస్థితిపై జడ్పీ చైర్మన్ గరం
ZP Chairman fire on the situation of social hospital

ఆకస్మికతనిఖీతో బయటపడ్డ బండారం

ముద్ర న్యూస్, మహాదేవపూర్: భూపాలపల్లి జిల్లా మాదాపూర్ మండల కేంద్రంలో ఉన్న ప్రముఖ సామాజిక ఆసుపత్రిలో కాన్పుల శాతం పూర్తిగా పడిపోయింది. ప్రభుత్వం మంజూరు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించడంలో స్థానిక వైద్యాధికారులు పూర్తిగా విఫలమయ్యారని, ఆస్పత్రి సందర్శించే రోగుల సంఖ్య 500 నుండి 80 మందికి పడిపోవడం పట్ల భూపాలపల్లి జడ్పీ చైర్మన్ శ్రీమతి జక్కు శ్రీ హర్షిని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆసుపత్రి కమిటీ సమావేశాలు జరగకపోవడం, స్థానిక ఎమ్మెల్యే ఆసుపత్రి నిర్వహణను పట్టించుకోకపోవడం కారణంగానే ఈ దుస్థితి నెలకొన్నదని జక్కు శ్రీ హర్షిని విమర్శించారు.

కమిటీ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే ఏనాడు ఆస్పత్రి సౌకర్యాలను గాని, నిరుపేద రోగుల బాధలను గాలికి వదిలేసాడని ఆమె ధ్వజమెత్తారు. ఓట్లు వేసి గెలిపించుకున్న ఎమ్మెల్యే ఆసుపత్రి పట్టించుకోకపోవడం ఈ ప్రజలు చేసుకున్న పాపమని ఆవేదన వ్యక్తం చేశారు. యూడిసీ స్థానికంగా ఉండకపోవడంతో రోజువారి ఉద్యోగులకు జీతాలు అందడం లేదని, గైనకాలజిస్ట్, హెడ్ నర్సును భూపాలపల్లికి డిప్యూటేషన్ వేశారని దీంతో కాన్పులకు ఆసుపత్రికి ఎవరు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డయాలసిస్ కేంద్రాన్ని త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ జక్కు హర్షిని తెలిపారు.

వీరి వెంట ఎంపీపీ రాణిబాయ్, సర్పంచి శ్రీపతి బాబు, ఉప సర్పంచ్ సల్మాన్ ఖాన్, ఎంపీపీ బి రాణి బాయి, కాబోయే మార్కెట్ కమిటీ చైర్ ఫర్సన్ పెండ్యాల మమత, ఎంపీటీసీ రెవెల్లి మమత-నాగరాజు, బీ ఆర్ ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ మహిళా ఇంచార్జీ కేదారి గీత, మండల యూత్ అధ్యక్షులు అలీం ఖాన్, టౌన్ అధ్యక్షులు కూరతోట రాకేశ్, ఎస్ సి సెల్ వేమునూరి జక్కయ్య, టౌన్ట్ యూత్ అధ్యక్షులు రెవెల్లి రాజశేఖర్, మండల నాయకులు కుంభం పద్మ, కారెంగుల బాపురావు, ఆన్కరి ప్రకాష్, మెరుగు లక్ష్మణ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.