వరదర్పణం.. చేపల దళారి నారాయణ రెడ్డి వల్లే చెరువు కట్ట తెగింది

వరదర్పణం.. చేపల దళారి నారాయణ రెడ్డి వల్లే చెరువు కట్ట తెగింది
  • వరద నీట మునిగిన పంట పొలాలు..
  •  ఆందోళనలో రైతులు.

ముద్ర న్యూస్ రేగొండ! : రేగొండ మండలంలో గత కొన్ని రోజులుగా కూరుస్తున్న వర్షాలకు.. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. 
మరోవైపు జిల్లాలోని చెఱువులు కుంటలు ఉధృతంగా వస్తున్న నీటితో నిండు కుండల మారాయి. దీంతో రేగొండ మండలంలోని దమ్మన్న పేట.చిన్న కోడెపక. చెరువులు తెగిపోయాయి. 
దీనితో చెరువుల కింద పంట పొలాలు వరద నీటితో ముంచెత్తడమే కాకుండా పంటపొలాలను కూడా ముంచేసింది. దీంతో పంట పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఇసుక మేటలు వేశాయి పత్తి, వరి,  పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

ఒక్క రేగొండ మండల కేంద్రంలోని చిన్న కోడెపక చెరువు కింద సుమారు 1800 ల ఎకరాలలో పంట భూములకు నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా వేస్తున్నారు అధికారులు. కొంత వర్షం తెరిపి నివ్వడంతో వ్యవసాయ అధికారులు పంట నష్టాన్ని అంచనా వేయడానికి పలు గ్రామాల్లో పర్యటించి దెబ్బ తిన్న పంటపొలాలను సందర్శించారు. మరోవైపు నీటిలో మునిగి ఉన్న పంటలను చూసి బోరుమంటున్నారు అన్నదాతలు.

చేపల దళారి వల్లే చెరువు కట్టకు ప్రమాదం

ప్రతి సంవత్సరం వర్షాకాలంలో చేపల పెంపకానికి చిన్న కోడెపక చెరువులో టెండర్ లు వేస్తారు.గత ఏడాది నుంచి కొప్పుల గ్రామానికి చెందిన నారాయణ రెడ్డి అనే చేపల దళారి టెండర్ వేసాడు.కాగా చెరువులో చేప పిల్లలు తాము ద్వారా మత్తడి ద్వారా వెళ్లి పోకుండా ఇనుప జాలి అమర్చడం.జాలి లోతుగా పట్టడం సిమెంట్ దిమ్మెలు పాతి చెరువులో నీరు కూడా బయటి పోకుండా జలీలు కట్టడం వల్ల వరద నూరు ఎక్కువై చెరువుకు గండి పడి కట్ట కొట్టుకుపోయిందని.అందువల్లే చెరువు పూర్తిగా కలైందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చేపల దళారి నారాయణ రెడ్డి పై చట్ట పరమైన చర్య తీసుకొని శిక్షించాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నారు.