బిజెపి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి

బిజెపి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలి

రామకృష్ణాపూర్,ముద్ర : తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పట్టణ బూత్ కమిటీల ఇంచార్జ్ యాదగిరి అన్నారు. ఆదివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని  64,65,79 బూత్ లలో మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి బిజెపి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 9 సంవత్సరాల సుపరిపాలన, పేదల సంక్షేమం గురించి వివరించారు. అనంతరం ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆరుముళ్ళ పోషం, సోషల్ మీడియా మండల ఇంచార్జ్ వేముల అశోక్,వైద్య శ్రీనివాస్,బూత్ ఇంచార్జ్ విరమల్ల రాజు,బూత్ అధ్యక్షులు సంతోష్ రామ్,బాలాజీ,లక్ష్మణ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.