దగ్ధమైన ఆయిల్ పామ్ పంటలను పరిశీలించిన అధికారులు

దగ్ధమైన ఆయిల్ పామ్ పంటలను పరిశీలించిన అధికారులు

ముద్ర న్యూస్ రేగొండ: రేగొండ మండలంలోని రేపాక గ్రామంలో  విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన రైతు బోయిన రాజయ్య  ఆయిల్ పామ్ పంటలను జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సంజీవ రావు,జిల్లా వ్యవసాయ శాఖ అధికారి విజయ్ భాస్కర్ లు శుక్రవారం పరిశీలించారు..ప్రమాదం జరిగిన తీరును తెలుసుకున్నారు.

రైతులకు ధైర్యాన్ని నింపారు..నష్టాన్ని అంచనా వేసి జిల్లా ఉన్నత అధికారులు,రాష్ట్ర ఉన్నత అధికారులకు నివేదిక సమర్పించి నష్టపరిహారం వచ్చేలా చూస్తామని తెలిపారు..ఈ కార్యక్రమంలో రైతులు బోయిని తిరుపతి రాజ్ మరియు సువెన్ ఆగ్రోస్ కంపెనీ ప్రతినిధి యుగేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.