నగరానికి కొత్త రూపు తెస్తున్నాం

నగరానికి కొత్త రూపు తెస్తున్నాం

మేయర్ వై సునీల్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ :గత మూడు సంవత్సరాలుగా నగరానికి కొత్త రూపు తెస్తున్నామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధి లో భాగంగా గురువారం నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, కమీషనర్ సేవా ఇస్లావత్ 50 వ డివిజన్ గణేష్ నగర్ లో పర్యటించారు. స్థానిక కార్పోరేటర్ కొలిపాక అంజయ్యతో కలిసి నగరపాలక సంస్థకు చెందిన 52 లక్షల 60 వేల రూపాయిల  నిధులతో మూడు చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ నగర అభివృద్ధి చెందాలనే నమ్మకంతో హైదరాబాద్ వచ్చిన స్మార్ట్ సిటీ హోదాను కరీంనగర్ నగరానికి ఇచ్చారు.

 వారి నమ్మకానికి తగ్గట్టుగా నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ల సహకారం తో నగరంలో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు నిరంతరంగా కొనసాగుతున్నాయన్నారు. నగరం అభివృద్ధి పనులతో రోజు రోజుకు కొత్త హంగులతో  రూపు రేఖలు మారుతున్నాయని తెలిపారు. గతంలో గణేష్ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం అయినప్పటికీ చాలా రోజుల క్రితం వేసిన రోడ్లు, డ్రైనేజీ లు అన్ని శిథిలావస్థకు చేరి స్థానిక ప్రజలకు సమస్యగా మారడంతో కార్పోరేటర్ కోరిక ప్రకారం నూతనంగా రోడ్లు డ్రైనేజీ లు నిర్మాణం చేయడం జరుగుతుందని తెలిపారు. నగరపాలక సంస్థ నుండి దాదాపు 52లక్షల నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. అంతే కాకుండా త్వరలో గణేష్ నగర్ లో యూజీడీ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ ప్రాంతంలో  అంతర్గత రోడ్లను గతంలో నే అభివృద్ధి చేశామని మిగిలిన రోడ్లను కూడ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. డివిజన్ లో ప్రజలు చాలా సమస్యలు మా దృష్టికి తేవడం జరిగింది వాటిని కూడ త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. గతంలొ వాటర్ సప్లైలో సరైన ప్రెషర్ లేదని ఫిర్యాదులు రావడంతో కోత్త పైపులైన్ కు ఇంటర్ కనెక్షన్ ఇచ్చి మంచి నీటి సమస్యను పరిష్కరించామని తెలిపారు. ఈ ప్రాంతం ప్రజలకు స్టేడియం నుండి వచ్చే గణేష్ నగర్ బైపాస్ రోడ్డు, డ్రైనేజీ పెద్ద సమస్యగా మారడంతో  స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో 40 కోట్లు నిధులు కేటాయించి పనులు చేస్తున్నట్లు తెలిపారు. దాదాపు రోడ్డు డ్రైనేజీ పనులు 80 శాతం పూర్తిగా మిగితా పనులు త్వరలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీస్కుంటున్నట్లు తెలిపారు. గణేష్ నగర్ బైపాస్ రోడ్డు కు ఉన్న లింకు రోడ్లను కూడ అభివృద్ధి చేయడం జరుగుతుందని తెలిపారు. గణేష్ నగర్ ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. కరీంనగర్ నగరానికి ముఖ్యమంత్రి కేసీఆర్ స్మార్ట్ సిటీ హోదా ఇచ్చి మంచి సువర్ణ అవకాశం కల్పించారని వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ కలలు కన్నట్లుగా కరీంనగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపుతామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.