జలదిగ్బంధంలో మోడల్ స్కూల్

జలదిగ్బంధంలో మోడల్ స్కూల్
  • విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
  • జాడ లేని అధికారులు

ముద్ర, సైదాపూర్ : మండలంలోని సోమరం గ్రామంలో నిర్మించిన మోడల్ స్కూల్ ను వరదలు చుట్టుముట్టాయి. గత రాత్రి కురిసిన భారీ వర్షానికి ఎగువ నుండి వరద పోటెత్తడంతో వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గ్రామ శివారులో నిర్మించిన మోడల్ స్కూల్  పూర్తిగా జల దిగ్బంధం అయింది. నాలుగు ఫీట్ల మేర వరద ప్రవహించడంతో ఏ క్షణమైనా హాస్టల్లోకి నీరు నీరు చేరే అవకాశం ఉంది. నీటి ప్రవాహం పెరుగుతుండడంతో హాస్టల్లో ఉన్న విద్యార్థినిలు భయాందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు, సంబంధిత అధికారులకు సమాచారం అందివ్వడంతో హుటాహుటిన చేరుకొని విద్యార్థినిలను సురక్షితంగా హాస్టల్ నుండి కాళీ చేపించి వారి స్వస్థలాలకు పంపించినట్లు సమాచారం. మోడల్ స్కూల్ నిర్మాణమే కాకుండా చుట్టు ప్రహరీ గోడ నిర్మాణానికి నిధులు  మంజూరు చేసినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి కారణంగానే నీరు చుట్టుముట్టాయని గ్రామస్తులు ఆరోపించారు.